భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి సీపీఎం కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండల కమిటీల తరుపున నేతలు అబ్దుల్ నబి, ఆలేటి కిరణ్ కుమార్లు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఏలూరి భవన్లో ఆదివారం నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ మహాసభల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.