సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలంటూ సర్పంచ్ కి వినతి

83చూసినవారు
సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలంటూ సర్పంచ్ కి వినతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం గ్రామపంచాయతీలో సంపూర్ణ మద్యపానం నిషేధం అమలు చేయాలని కోరుతూ శనివారం డి.వి.ఎన్ యూత్ సభ్యులు గ్రామ సర్పంచ్ నాలి కృష్ణవేణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలు మద్యపానానికి బానిసలై అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. దీనికి గ్రామ సర్పంచ్ సానుకూలంగా స్పందించారు. గ్రామ సభను ఏర్పాటు చేసి మద్యపానం నిషేధం అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంపాటి ప్రసాద్, గ్రామ యూత్ సభ్యులు వి మోతిలాల్, జి రాము, లక్ష్మణ్, నరేష్, కుమార్, ఎం నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్