ఇల్లందు పట్టణ పరిధిలోని స్థానిక 22, 23వ వార్డుల పరిధిలో కుక్కలు దాడి చేసిన ఘటనలో ఇద్దరు చిన్నారులు, వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనతో వార్డులోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.శనివారం చిన్నారులు చింత కీర్తన, ముస్కాన్ లు పాఠశాలకు వెళ్లేందుకు స్కూల్ బస్ స్టాప్ వద్దకు రాగా అక్కడ గుంపుగా ఉన్న కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. 22వ వార్డుకు చెందిన ఉసికల చంద్రయ్య పై సైతం కుక్కలు దాడి చేశాయి.