ఇవాళ KRMB సమావేశం.. ఆ అంశాలపైనే చర్చ

82చూసినవారు
ఇవాళ KRMB సమావేశం.. ఆ అంశాలపైనే చర్చ
ఏపీ సర్కార్ కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని TG మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇటీవలే KRMBకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే KRMB చైర్మన్‌ అతుల్‌ జైన్‌ అధ్యక్షతన శుక్రవారం బోర్డు సమావేశం కానుంది. శ్రీశైలం, సాగర్‌ నుంచి నీటిని ఏపీ అక్రమంగా తరలిస్తోందని, వెంటనే అడ్డుకోవాలని ఉత్తమ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో 35 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని TG ప్రభుత్వం KRMBని కోరింది. అదేవిధంగా సాగర్ ప్రాజెక్ట్ వివాదంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్