హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై తెలంగాణ ACB నమోదు చేసిన కేసుపై ఈడీ ఆరా తీసింది. ఈ వ్యవహారంపై ఏసీబీ నుంచి ED అధికారులు FIR సహా పలు పత్రాలు కోరినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు చెల్లింపులు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో రెగ్యులర్ ప్రాసెస్‌లో భాగంగా ED ఆరా తీసింది. డాక్యుమెంట్ల పరిశీలన తర్వాత KTRపై కేసు నమోదు చేయాలా? వద్దా? అనేది ఈడీ నిర్ణయం తీసుకోనుంది.