తెలంగాణలో నేరాలు, ఘోరాలు జరుగుతుంటే సీఎం రేవంత్ మాటిమాటికీ ఢిల్లీ వెళ్తున్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 'ఇప్పటివరకు 19సార్లు CM ఢిల్లీ వెళ్లారు. నాకు తెలిసి ఇదో రికార్డ్. KCR తన పదేళ్ల పాలనలో ఇన్నిసార్లు పోయినట్లు లేదు. పాపం ఈయన ఇంకెన్నిసార్లు వెళ్లాలో?' అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రభుత్వ టీచర్లను పట్టుకొని CM స్థాయి వ్యక్తి ఇంటర్, డిగ్రీ ఫెయిలైనవాళ్లు అని మాట్లాడటం సరికాదన్నారు.