ఫార్ములా-ఈ రేసు కేసులో విచారణకు కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరారు. కేటీఆర్ లాయర్, మాజీ ఏఏజీ రామచందర్ రావు ఆయనతో పాటు వెళ్తున్నారు. కాగా, విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూం వరకే లాయర్‌ను అనుమతించనున్నారు. పోలీసులు ACB ఆఫీస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ఆధారంగా KTRను విచారించనున్నారు.