మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం

58చూసినవారు
మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
ప్రముఖ తెలంగాణ జానపద కళాకారుడు కిన్నెర మొగులయ్యను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కలిశారు. గత ప్రభుత్వం ఇస్తున్న నెలవారీ ఆర్థిక సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో మొగులయ్య ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన కూలీ పని చేసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన కేటీఆర్, మొగులయ్యతో ఆర్థిక ఇబ్బందులపై ఆరా తీశారు. అనంతరం మెగులయ్యకు కొంత ఆర్థిక సహాయం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్