తెలంగాణలో మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా రేవంత్ సర్కార్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను కొనుగోలు చేసి అద్దెకు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రయత్నాన్ని ప్రయోగాత్మకంగా మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.