కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలానికి చెందిన నర్సవ్వ (92) ఇటీవల కన్నుమూసింది. ఆమెకు శంకర్ (60), మాధవ్ (56) అనే కొడుకులున్నారు. ఆమె అంత్యక్రియలు కోసం రూ.40 వేలు అప్పు తెచ్చి ఖర్చు చేశారు. అప్పు ఎవరు తీర్చాలనే దానిపై బుధవారం చర్చ జరగడంతో అన్నదమ్ములిద్దరూ కొట్టుకున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు దాడి చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.