పెంపుడు కుక్కపై చిరుత దాడి.. వీడియో వైరల్

3673చూసినవారు
ఓ పెంపుడు కుక్కపై చిరుత పులి దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సన్‌రైజ్ వ్యాలీలోని ఒక ఇంటి గార్డెన్‌లో నల్ల కుక్క ఉండగా, ఒక చిరుత గోడ దూకి అక్కడకు వచ్చింది. కుక్క మెడను నోటితో పట్టుకుని కొరికి చంపేందుకు ప్రయత్నించింది. అయితే పెంపుడు కుక్క అరుపులు విన్న యజమానురాలు కేకలు వేస్తూ అక్కడకు వచ్చింది. అయితే ఆమె రాకను గమనించిన చిరుత ఆ కుక్కను వదిలేసి పరారైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్