ఈనెల 11 నుంచి అయోధ్యలో వార్షికోత్సవాలు

83చూసినవారు
ఈనెల 11 నుంచి అయోధ్యలో వార్షికోత్సవాలు
అయోధ్య ఆలయంలో రామ్‌లల్లా ప్రతిష్టాపనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జనవరి 11న సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిషేకం జరిపించనున్నారు. ప్రతిష్ఠా ద్వాదశి వార్షికోత్సవాలు 11 నుంచి 13 వరకు 3 రోజులపాటు కొనసాగనున్నాయి. రామాలయం సమీపంలోని ‘అంగద్ తిల’లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాన్ని సీఎం యోగి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు, భక్తులకు ఆహ్వానాలు పంపామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్