స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు నేడు సమావేశం కానున్నారు. గ్రామపంచాయతీల ఎన్నికలకు ఓటర్ల జాబితాలు, పోలింగు కేంద్రాలు సిద్ధం కాగా.. MPTC, ZPTC సభ్యుల ఎన్నికల కోసం ఓటర్ల, పోలింగు కేంద్రాల జాబితాలు ఈ నెల 15న విడుదలవుతాయి. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల సమాచారం రాగానే EC షెడ్యూల్ ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్లను ఎన్నికలకు సంసిద్ధం చేసేందుకు సమావేశం నిర్వహిస్తోంది.