TG: హైదరాబాద్‌లో లారీ బీభత్సం సృష్టించింది. ముషీరాబాద్ జంక్షన్ వద్ద ఆదివారం అర్థరాత్రి ఓ లారీ అదుపుతప్పి పార్కు చేసిన వాహనాల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతిచెందగా.. ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని.. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లారీ డ్రైవర్ యూసుఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు.