మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా-భారత్ బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్‌కు శుభారంభమే దక్కింది. యువ బ్యాటర్ సామ్ కాన్‌స్టాస్ (60) అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 112 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఉస్మాన్ ఖవాజా (38), మార్నస్ లబుషేన్ (12) ఉన్నారు. రవీంద్ర జడేజా అద్భుతమైన బంతికి కాన్‌స్టాస్ వికెట్ల ముందు దొరికిపోయాడు.