మందు వేసినప్పుడు ఎక్కడా లేని ధైర్యం వస్తుందని చెబుతుంటారు. దీనిని నిజం చేస్తూ ఓ మందుబాబు ఏకంగా నాగపాముతోనే ఆటలాడాడు. అనంతపురం జిల్లా టీవీ టవర్ వద్ద రోడ్డుపై ఓ పాము కనిపించడంతో మందుబాబు దాంతో ఆటలాడాడు. పామును చేత్తో పట్టుకొని హల్చల్ చేశాడు. ఇది చూసిన కొందరు భయపడిపోయారు. పాము ఏ మూడ్‌లో ఉందో ఏమో గానీ మందుబాబు బతికి పోయాడని అటుగా వెళ్లేవారు తెలిపారు.