TG:నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మిడ్‌డే మీల్స్ వికటించి 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పాఠశాల HM మురళీధర్ రెడ్డి, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం బాపురెడ్డిని సస్పెండ్ చేసింది. అలాగే మధ్యాహ్న భోజన ఏజెన్సీని టర్మినేట్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ దవాఖానాలో విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.