తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గురువారం ఎయిడ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో హెచ్ఐవీ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికి ఉచితంగా హెచ్ఐవీ పరీక్షలను ఉచితంగా చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రియ, జ్యోతి, విజయ మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.