ట్రాక్టర్ బోల్తాపడి ఓ యువకుడు మృతి మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం స్థానిక వివరాల ప్రకారం. బిజినపల్లి మండలం మంగనూరులో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ పైనున్న మహేష్ (18) అనే యువకుడు అక్కడికక్కడనే మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబంలో, గ్రామంలో, విషాదఛాయలో అలుముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.