రైలు ఢీకొని ఓ మృతి చెందిన ఘటన దేవరకద్రలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. దేవరకద్ర పట్టణంలోని ఎస్సి కాలనీ సమీపంలో రైలు ఢీకొని బోయ నర్సింహ (38) అనే వ్యక్తి మృతి చెందాడు. మక్తల్ నియోజక వర్గం నర్వ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడు నరసింహ నర్వ గ్రామ పంచాయతి కార్యాలయంలో పని చేస్తున్నాడని, ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.