మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబురాన్ని అంటినాయి. సోమవారం మొదటి రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా భోగి మంటలు వేసి ప్రజలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెల్లవారుజామున భోగి రోజున పలు కానీలలో పెద్దలు, యువకులు, పిల్లలతో భోగి మంటలను ఆనందోత్సవాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మంటలతో అందరికీ ఆయురారోగ్యాలు పెంచుతూ భగవంతుడు అందరినీ సమానంగా చూడాలని పేర్కొన్నారు.