దేవరకద్ర: సంక్షేమ పథకాలు ఓ నిరంతర ప్రక్రియ: జిల్లా కలెక్టర్

63చూసినవారు
జిల్లాలో సంక్షేమ పథకాల అమలు ఓ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి స్పష్టం చేశారు. మంగళవారం దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామసభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ. సంక్షేమ పథకాల అర్హులను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేనిర్వహించి రూపొందించిన జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలుపాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్