మదనాపురం మండలంలోని నర్సింగపురం, నెలివిడి గ్రామాలలో పిఎసిఎస్ కొత్తకోట వారి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం వరి కొనుగోలు సెంటర్లను మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చీర్ల శ్రీనివాసులు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రైతులు వరి ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధరను మరియు సన్న రకాలకు 500 బోనస్ పొందాలన్నారు.