రోడ్ షో విజయవంతం చేయాలి

50చూసినవారు
రోడ్ షో విజయవంతం చేయాలి
ఈ నెల 26వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో విజయవంతం చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో మంగళవారం దేవరకద్ర నియోజక వర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పల్లె రవి, దేవరకద్ర నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్