తెలంగాణ వైతాళికుడు, వనపర్తి శాసనసభ్యుడు, తెలంగాణ సాంఘీక, రాజకీయ చైతన్యం అంటేనే పేరు గుర్తుకు వచ్చే సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెడుతూ, క్యాబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని శనివారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆహ్వానిస్తున్నామన్నారు. ఇది సముచితమైన నిర్ణయమని సురవరం తెలంగాణ సాంఘీక జీవనానికి పునాది వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కొనియాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.