జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలలో సోమవారం ఆరుద్రోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆరుద్ర నక్షత్రం రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆలయ ఆనవాయితీ. గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.