జూరాల ప్రాజెక్టుకు జలకళ

54చూసినవారు
జూరాల ప్రాజెక్టుకు జలకళ
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శుక్రవారం కృష్ణానదికి వరద పోటెత్తింది. పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుండటంతో జూరాలకు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటలకు అన్నదాతలు దుక్కులు దున్నుకుంటున్నారు. జూరాలకు జలకళ సంతరించుకోవడంతో పర్యాటకుల సందడి మొదలైంది. జలాశయాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు.

సంబంధిత పోస్ట్