గద్వాలలోని అక్షర పాఠశాలకు చెందిన విద్యార్థి యశ్వంత్ (6) అనారోగ్యంతో మృతి చెందడంతో సోమవారం అర్ధరాత్రి విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల దగ్గరికి వెళ్లి ఆందోళన చేపట్టారు. బస్సులో ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలోనే విద్యార్థి చనిపోయాడని, ఆ తర్వాత పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఆరోపించారు. విద్యార్థి అనారోగ్యాన్ని తల్లిదండ్రులకు తెలియజేయకపోవడంతోనే విద్యార్థి మృతి చెందారని, స్కూల్ ను రద్దు చేయాలన్నారు.