ఓ వ్యక్తిపై మూకుమ్మడిగా కొందరు దాడి చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. కేటీదొడ్డి మండలం ఈర్లడండకి చెందిన రాముడు అదే గ్రామానికి చెందిన కొందరు తనపై దాడి చేసినట్లు బాధితుడు వాపోయారు. తన తల్లిపై అకారణంగా దాడి చేస్తుండటంతో అడ్డువెళ్లినందుకు తనపై దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో తన తలకు తీవ్రంగా గాయమైందని, ఈ విషయమై పోలీసులను ఆశ్రయించగా పట్టించుకోలేదని తనకు న్యాయం చేయాలని ఆరోపించారు.