వెల్దండ మండలం మహాత్మా గాంధీ తండాలో శుక్రవారం ఉదయం జరిగిన దారుణ సంఘటనలో రాత్లావత్ రాజు (30) యువకుడిని పొలంలో దారుణంగా హత్య చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న లంబాడి హక్కుల పోరాట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు బాణావత్ శంకర్ నాయక్ ఈ హత్యను ఖండిస్తూ, పోలీసులు ఈ కేసుపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.