అమ్మాపూర్ తాండ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
హన్వాడ మండలం అమ్మాపూర్ తాండ పంచాయతీ కార్యదర్శి శివప్రకాశ్ ను శుక్రవారం అధికారులు సస్పెండ్ చేశారు. శివప్రకాశ్ గతంలో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. ఈయన పని చేసిన కాలంలో రూ.1.73 కోట్ల గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని గత నెలలో జరిపిన డిపిఎల్వో విచారణలో తేలింది. దీంతో సస్పెన్షన్కు గురయ్యారు.