మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో తమిళనాడు రాష్ట్రం నమ్మక్కల్ జిల్లా కేంద్రానికి చెందిన అన్బు చార్లెస్ 60ఏళ్ల వయస్సలోనూ పర్యావరణ పరిరక్షణ అంశంపై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పర్యావరణ పరిరక్షణ చేపట్టకపోతే మానవాళికి ముప్పు పొంచి ఉందని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ తిరుపాజీ, పోలీస్ సిబ్బంది చార్లెస్ ను శాలువాతో సన్మానించారు.