మహబూబ్ నగర్ జిల్లా అప్పన్నపల్లిలో టచ్ అనాధ ఆశ్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి జన్మదిన సందర్భంగా సోమవారం సాయంత్రం మాజీ మూడ డైరెక్టర్ వై. జి. ప్రీతం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు హ్యాపీ బర్తే అనిరుద్ రెడ్డి సార్ అని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ డి. శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, కాశీవిశ్వనాథ్, ఆశ్రమ నిర్వాహకులు వినయ్ పాల్గొన్నారు.