మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి అరుణాచలంకు వెళ్తున్న జేబిటి ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడంతో మృతి చెందారు. ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 15మందికి గాయాలయ్యాయి. మృతదేహాలను జడ్చర్ల ఆసుపత్రికి, క్షతగాత్రులను మహబూబ్ నగర్, జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రులకు పోలీసులు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.