ఓ మహిళ నగ్న చిత్రాలు తీసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా చోటుచేసుకుంది. మంగళవారం ఎస్ఐ విక్రమ్ వివరాలు. జడ్చర్ల నియోజకవర్గం నవాబు పేట మండలంలో ఓ మహిళ స్నానం చేస్తుండగా నర్సింహులు ఫొటోలు తీశాడు. సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజు రోజుకి వేధింపులు పెరగడంతో బాధితురాలు పీస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.