ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, జాతీయ మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ బ్యాగరి వెంకట స్వామి అన్నారు. దళితుల జనాభా దామాషా ప్రకారం 25 శాతానికి రిజర్వేషన్లు పెంచాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన ఏక సభ్య కమిషన్ ఛైర్మన్ షమీం అక్తర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బ్యాగరి వెంకటస్వామి మాట్లాడుతూ. 2024 జనాభా లెక్కల ప్రకారం గణన చేయాలన్నారు.