మహబూబ్ నగర్: పొంచి ఉన్న ప్రమాదం

73చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి నవాబుపేట వెళ్లే ప్రధాన రహదారి పిల్లలమర్రి స్టేడియం దగ్గర రోడ్డు కృంగిపోయి ఇబ్బందిగా మారింది. గత కొన్ని రోజులుగా రోడ్డు క్రిందనుంచి నీరు ప్రవహిస్తుండటంతో రోడ్డు కృంగి గుంతలు ఏర్పడ్డాయి. దీంతో రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గురువారం వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రోడ్డును బాగుచేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్