మహిళ అదృశ్యం..కేసు నమోదు

59చూసినవారు
మహిళ అదృశ్యం..కేసు నమోదు
ఓ మహిళ అదృశ్యమైన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ తిరుపాజీ వివరాలు. జార్ఖండ్ కు చెందిన శివ భరోసింగ్, శకుంతలాదేవి(45) భార్యాభర్తలు. శివ భరోసింగ్ జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గత నెల 23న శకుంతలాదేవి ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయింది. చుట్టుపక్కల బంధువులలో ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదు. శుక్రవారం భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్