కడ్తాల్, అమనగల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. విజయ డైరీ పాల రైతులకు మూడు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి మద్దతుగా అమనగల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.