కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల బిల్డింగ్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని కోరుతూ బుధవారం మధ్యాహ్నం పిడిఎస్ యు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు శివ, పరశురామ్, రాజు తహాశీసిల్దార్ కు పలు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.