కడ్తాల్ మండలం, గ్రామపంచాయతీ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఢిల్లీ శ్రీను కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం మృతుడి కుటుంబాన్ని స్థానిక నేతలతో కలిసి మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహ పరామర్శించి ఓదార్చారు. శీను కుటుంబానికి పదివేల ఆర్థిక సాయం అందజేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమం కోసం నిరంతరాయంగా కృషి చేస్తానని అన్నారు.