ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు వ్యక్తులు మృతి

5084చూసినవారు
కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండల పరిధిలోని వాసుదేవ్ పూర్ గేట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం బస్సు కారు ఢీకొని కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఐటెన్ కారును ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టింది. పోలీసులు స్థానికుల సహాయంతో కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జెసిబి సహాయంతో వెలికితీశారు. మృతుల వివరాలు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్