మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నీటి లీకేజీ నేపథ్యంలో అధికారులపై ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి లీకేజీల కారణంగా వార్డుల్లో నీరు చేరుకుని రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ లీకేజీలపై అంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే ఈ సమస్యల పరిష్కారించాలని ఆదివారం ఆదేశించారు.