మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రసవం అనంతరం మహిళ మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు గండీడ్ మండలం ఆసిరెడ్డిపల్లికి చెందిన రజిత జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించింది. అనంతరం ఆమె మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రసవం అనంతరం ఆమెను ఐసియులో పెట్టకుండా ఎవరు సరిగా పట్టించుకోలేదని కుటుంబీకులు ఆరోపించారు.