మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్‌లో ప్రమాదం జరిగింది. బాలమ్మ (55) అనే మహిళ పొలంలో పని ముగించుకుని రామాలయం బ్రిడ్జి దగ్గర బస్సు ఎక్కబోయి కాలుజారి బస్సు కింద పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. దీంతో బాలమ్మ కాలుకు తీవ్ర గాయమైంది. స్థానికులు 108కి సమాచారం ఇవ్వగా అంబులెన్స్ సిబ్బంది ఆమెకు చికిత్స చేసి 108లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.