శనివారం వార్డు విజిట్ లో భాగంగా పాత పాలమూరులోని మల్టీ పర్పస్ కమిటీ హాల్ పనులను మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న పనులను శర వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పుర కమిషనర్ చంద్రకుమార్, కాలనీవాసులు భరత్, నక్కినమోని కుమార్, నవకాంత్, నరేందర్, శాంతయ్య, మరియు ఇతర పెద్దలు పాల్గొన్నారు.