మహాబూబ్ నగర్: ఆస్పత్రిలో మహిళ సూసైడ్
మహాబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉరేసుకున్న విషయం తెలిసిందే. దామరగిద్ద మండలం కందేన్పల్లికి చెందిన నారమ్మ(32) భర్తతో విడాకులు తీసుకొని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మహాబూబ్ నగర్ ఆస్పత్రికి వచ్చింది. మంగళవారం ఉదయం బాత్రూంలో సూసైడ్ చేసుకుంది. కడుపునొప్పి భరించలేక తన కూతురు సూసైడ్ చేసుకుందని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.