Oct 18, 2024, 07:10 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
నారాయణపేట: సమయానికి బస్సులు నడపాలని వినతి
Oct 18, 2024, 07:10 IST
విద్యార్థులకు సమయానికి బస్ సర్వీసులు నడపాలని కోరుతూ శుక్రవారం నారాయణపేట ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీశైలమ్మ కు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రం అందించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ పవన్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలకు సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. బస్ పాసులకు కట్టిన డబ్బులు వృథా అవుతున్నాయని అన్నారు.