మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన మక్తల్ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నలుగురు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వారిని మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వైద్యులు ఎమ్మెల్యేకు చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.