నర్వ: ప్రోటోకాల్ ప్రకారం పేర్లు నమోదు చేయాలి

59చూసినవారు
నర్వ: ప్రోటోకాల్ ప్రకారం పేర్లు నమోదు చేయాలి
అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలకు ఏర్పాటు చేసే శిలాఫలకాలపై ప్రోటోకాల్ ప్రకారం పేర్లను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని బుధవారం నర్వ ఎంపీడీవోకు బిజెపి నాయకులు వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వం నిధులతో నిర్మిస్తున్న వాల్మీకి భవనం శిలాఫలకంపై ప్రోటోకాల్ ప్రకారం పేర్లు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్